
మెదక్, 22 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కనక దీనిని వెంటనే రద్దు చేయాలని మెదక్ జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసనకు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. 'శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా వారు ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..