సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పది .. మంత్రి కోమటిరెడ్డి
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Minister


నల్గొండ, 22 సెప్టెంబర్ (హి.స.)

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో నల్లగొండలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ - 2026 కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 189 మంది ఉపాధ్యాయులను వారు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నమోదు తగ్గినప్పటికీ నల్లగొండ జిల్లాలో 9 శాతం పెరగడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నప్పటికీ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నారనే అంశంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande