పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..... మంత్రి పొంగులేటి
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..... మంత్రి పొంగులేటి
Minister


ఖమ్మం, 22 సెప్టెంబర్ (హి.స.)

రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వార ఏదులాపురం మున్సిపాలిటీ

పరిధిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ భవన సముదాయ నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పనుల నాణ్యత పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడంలో లోపాలు కనిపించడం పై సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉన్నప్పటికీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande