
హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సచివాలయంలో జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే తొలి సమావేశం కావడం విశేషం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన చివరిసారిగా ఈ కమిటీ చివరి సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి హోదాలో ఈ స్థాయి హైపవర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సచివాలయంలో జరిగిన ఈ కీలక భేటీలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు తీరుతెన్నులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో విస్తృతంగా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల వేగవంతమైన పరిష్కారంపై ప్రత్యేకంగా చర్చించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు