హైడ్రాకు చట్టపరమైన గుర్తింపు విషయంలో కీలక ముందడుగు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హైడ్రాకు చట్టపరమైన గుర్తింపు మరియు అదనపు అధికారాల ను కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది.
Governor


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హైడ్రాకు చట్టపరమైన గుర్తింపు మరియు అదనపు అధికారాల ను కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది.

తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో సమర్థవంతమైన పాలన, డిజిటల్ ఆధారిత వ్యవస్థగా తీర్చిదిద్దడం దిశగా కీలక అడుగు పడింది. క్యూర్ బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు.

దీంతో జీహెచ్ఎంసీ-1955 స్థానంలో క్యూర్ -2026 చట్టం అమల్లోకి రానుంది. ఒకే నగరం.. ఒకే పరిపాలన ఒకే చట్టం లక్ష్యంతో జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల పరిధిలో వర్తించేలా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా హైడ్రాకు చట్టపరమైన గుర్తింపు, అదనపు అధికారాలు లభించనున్నాయి. క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఏకీకృత పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కాలం చెల్లిన, అవసరం లేని నిబంధనలను తొలగించడం ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా మార్పులు చేయడం లక్ష్యంగా క్యూర్ బిల్లును తీసుకువచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande