బిఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
MGMMGM


వరంగల్, 22 సెప్టెంబర్ (హి.స.) వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వినయ్ భాస్కర్ కాలు, చేతికి గాయాలై రక్తస్రావం జరిగినట్లు ఆయన వర్గీయులు తెలిపారు.

ఆదివారం ఎంజీఎంలోని ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో రోగులు, అటెండర్లు గాయపడిన ఘటన మరువకముందే మంగళవారం ఆస్ఐసీయూ వార్డులో మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి.

ఈ విషయం తెలుసుకున్న వినయ్ భాస్కర్ ఆస్పత్రి పరిస్థితులను పరిశీలించేందుకు ఎంజీఎంకు చేరుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలో వినయ్ భాస్కర్కు గాయాలైనట్లు ఆయన వర్గీయులు తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు 'సీఎం డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అనంతరం పోలీసుల నిర్బంధాలను ఛేదించి వినయ్ భాస్కర్ ఎంజీఎం ప్రాంగణంలోకి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రశ్నించే గొంతులను అణచివేయడమే కాంగ్రెస్ ప్రజాపాలనగా మారిందని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande