విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అంశంపై ఉద్రిక్తత.. నిరసనకారులపై పోలీసుల చర్య
విజయవాడలో మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రాజకీయ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అంశంపై ఉద్రిక్తత.. నిరసనకారులపై పోలీసుల చర్య


అమరావతి , 22 సెప్టెంబర్ (హి.స.)విజయవాడలో మెగా డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రాజకీయ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు చేపట్టారు.

నిరసనకారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ జరిగింది. నిరసన సమయంలో SAAP కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. బారికేడ్లు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట, ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande