ఎండిపోతున్న పంటలకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి.... సీపీఐ
రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
రైతుల రుణమాఫీకి షరతుల్లేకుండా ముందుకు రావాలి- సీపీఐ


అనంతపురం, 22 సెప్టెంబర్ (హి.స.)వర్షాలు లేక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మరియు రైతులందరికీ ఎలాంటి షరతులు విధించకుండా పూర్తిస్థాయి రుణమాఫీ వర్తింపజేయాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు తక్షణ పరిహారం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ డి. జగదీష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

“మార్పు రావాలి – మార్పు అనివార్యం” అనే నినాదంతో కళ్యాణదుర్గం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల బైక్ జాతాను మంగళవారం ఆయన ప్రాంరంభించారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ డి. జగదీష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వర్షాభావం, అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని, ఇలాంటి సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని,రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా పూర్తిస్థాయి రుణమాఫీ ప్రకటించాలని, పంట నష్టాలకు తక్షణ పరిహారం చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు–పవన్ కళ్యాణ్–బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజలపై అప్పుల భారం మోపుతోందని విమర్శించారు. అమరావతి నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూనే రైతులకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ, సాగునీటి సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande