
తిరుమల, 22 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లను సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిసేంతవరకూ నిలిపివేయడంతో.. స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గింది.
మంగళవారం ఉదయానికి 3 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు దర్శనార్థం వేచి ఉండగా.. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనానికి 1-2 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక స్వామివారిని నిన్న (సోమవారం) 65,223 మంది భక్తులు దర్శించుకోగా.. 27,112 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లుగా సమకూరింది. 4.29 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV