
కర్నూలు, 22 సెప్టెంబర్ (హి.స.) : కర్నూలు జిల్లాలో ఆదోని, ఆలూరు, కొలిమిగుండ్ల మండలంలో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది.ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసింది. రహదారులపై నీరు ప్రవహించి ఎక్కడ చూసినా వర్షపు నీరు పొలాల్లో నిలిచింది. ఇంతటి వర్షం గతంలో ఎన్నడు కురవలేదని స్థానిక ప్రజలు తెలిపారు. కాగా కొందరు రైతులు రహదారిపై ఆరబోసి మొక్కజొన్నలు తడిచి ముద్దయ్యాయి.
రాబోయే 24 నుండి 48 గంటల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్నలు తడిచిపోగా, ఎండిన చెరువులు, వాగులు, వంకల్లోకి నీరు చేరింది. అయితే ఈ వర్షాలు ఆలస్యంగా కురిశాయని రైతులు పేర్కొంటున్నారు.
కొలిమిగుండ్ల మండలంలోని తిమ్మనాయునిపేట గ్రామంలో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. వీధులు జలమయంగా మారాయి. గ్రామ శివార్లలోని పలువురి ఇండ్లలోకి నీరు ప్రవేశించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
మండలంలోని చింతలాయపల్లె ప్రధాన రహదారిపై వర్షపునీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV