తెగిపోయిన విద్యుత్ వైర్లు తప్పిన ప్రమాదం
తెగిపోయిన విద్యుత్ వైర్లు తప్పిన ప్రమాదం
తెగిపోయిన విద్యుత్ వైర్లు తప్పిన ప్రమాదం


తెనాలి , 23 సెప్టెంబర్ (హి.స.)

గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈరోజు విద్యుత్ వైర్లు తెగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన వలన రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గుంటూరు మార్గం నార్త్ సైడ్ లో ఉన్న మెయిన్ విద్యుత్ వైర్ తెగిపడటంతో అధికారులు వెంటనే స్పందించి గుంటూరు - రేపల్లె రైలును తెనాలి ఔటర్ లో నిలిపివేశారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సిబ్బంది మరియు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు పనులు ప్రారంభించారు. త్వరలోనే సమస్యను పరిష్కరించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని తెలిపారు. విద్యుత్ వైర్లు తెగినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande