తగ్గుతున్న బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ఉదయం కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి.
gold


ముంబై, 23 సెప్టెంబర్ (హి.స.)గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ఉదయం కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,320గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,540గా ఉంది.మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉంది.

హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,320, 22 క్యారెట్ల ధర రూ.1,40,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,53,320, 22 క్యారెట్ల ధర రూ.1,40,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,53,320, 22 క్యారెట్ల ధర రూ.1,40,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,320, 22 క్యారెట్ల ధర రూ.1,40,540 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande