ఏపీ తీరం వైపు దూసుకువస్తున్న తీవ్ర వాయుగుండం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Rain


అమరావతి ,, 23 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

అటు అన్ని ప్రధాన ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు ఏపీలోని 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం.. తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతుందని.. ఈరోజు రాత్రి విశాఖపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అలర్ట్ జారీ చేశారు. వర్షప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖ, విజయనగరం, అల్లూరి జిల్లాల్లో అలాగే.. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఏపీలో 9 జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాకు హెచ్చరికలు జారీ చేశారు. గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. అల్లూరి, మన్యం జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande