రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Good news


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు బత్యం విడుదలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రెండు డీఏలకు అంగీకరించింది. ఇవాళ సెక్రటేరియట్లో సీఎస్తో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై చర్చించిన అనంతరం ప్రభుత్వం రెండు డీఏ (DA)లను ఆమోదించినట్లు ప్రకటించారు.

ఆమోదించిన రెండు డీఏలలో మొదటి డీఏను రాబోయే అక్టోబర్ నెల జీతంతో కలిపి ఉద్యోగులకు చెల్లించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande