ఆరు జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు.
Rain


శ్రీకాకుళం , 23 సెప్టెంబర్ (హి.స.)భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో విద్యాసంస్థలకు ఈరోజు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలతో పాటు పలు ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించారు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని పలు మండలాల్లో ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే పరిస్థితి ఉండటంతో విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో నదులు, కాలువలు ఉధృతంగా ప్రవహించే పరిస్థితి కూడా ఉండటంతో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వడం ద్వారా ప్రయాణ ప్రమాదాలను తగ్గించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande