పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి.. జనగామ జిల్లా కలెక్టర్
పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
Collector


జనగామ, 23 సెప్టెంబర్ (హి.స.)

పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. బుధవారం బచ్చన్నపేట మండలం పోచన్నపేటలోని ఎంపీపీఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన కలెక్టర్.. ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్ల వినియోగంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనంతరం వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి అభ్యసన స్థాయిని పరిశీలించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande