అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్స్.. జోగులాంబ కలెక్టర్
నిబంధనల ప్రకారం అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.
Collector


జోగులాంబ గద్వాల, 23 సెప్టెంబర్ (హి.స.)నిబంధనల ప్రకారం అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుందని, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

సెర్ప్ సహకారంతో గద్వాలలోని జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో రెండు రోజుల పాటు మానసిక సమస్యలు ఉన్న దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక మెగా సదరం శిబిరంను బుధవారం జిల్లా కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా అధికారులు, వైద్యులతో మాట్లాడి తగు సూచనలు చేశారు.శిబిరంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పలువురు కుటుంబ సభ్యులతో దివ్యాంగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande