గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. ఎమ్మెల్యే పవార్ రామారావు
గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్
Mla


నిర్మల్, 23 సెప్టెంబర్ (హి.స.)

ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో మరియు ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలోని కుంటాల మండలంలోని లింబా (కె), లింబా (బి) గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. అలాగే మరికొన్ని అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. లింబా (కె) గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనం, హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిధంగా రూ.12 లక్షలతో నిర్మించనున్న మరో అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. లింబా (బి) గ్రామంలో రూ.30 లక్షలతో నిర్మించనున్న గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రతి గ్రామానికి రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఐక్యంగా ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande