ఇక ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు.. మంత్రి శ్రీధర్ బాబు
మీసేవ డోర్ ' ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు.
Minister


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)

ఇకనుండి ప్రజలు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వ సేవలను నేరుగా ఇంటి వద్దకే అందించే 'మీసేవ డోర్ ' రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు.

ప్రజా పాలనను పౌరులకు మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన విధానం ద్వారా పౌరులు 1100 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి గానీ, అధికారిక మీసేవ పోర్టల్ ద్వారా గానీ తమకు అనుకూలమైన సమయానికి స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.

స్లాట్ బుక్ చేసుకున్న సమయానికి మీసేవ ఎగ్జిక్యూటివ్లు నేరుగా దరఖాస్తుదారుల ఇంటికే చేరుకుని, సంబంధిత దరఖాస్తులను స్వీకరించి ప్రాసెస్ చేస్తారు.

ఈ డోర్ డెలివరీ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లతో పాటు రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఈసీ (ఎన్కంబరెన్స్) కాపీలు, ఐజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్లు, పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ ధ్రువీకరణ సేవలు ప్రజలకు గడప వద్దే సులభంగా అందుబాటులోకి రానున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande