ఆధునిక సదుపాయాలతో పాఠశాలల అభివృద్ధి.. మంత్రి ఉత్తమ్ కుమార్
పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Minister


నల్గొండ, 23 సెప్టెంబర్ (హి.స.) నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సుమారు రూ.7 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తాటిపాముల గ్రామం తనకు కన్నతల్లిలాంటిదని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా జీవితాంతం పుట్టిన గడ్డ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో లభించే స్థాయి విద్యా ప్రమాణాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా అందాలనే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande