శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రైలు ప్రమాదం.. నలుగురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
శ్రీకాకుళం జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Accident


అమరావతి , 23 సెప్టెంబర్ (హి.స.)శ్రీకాకుళం జిల్లాలో బుధవారం చోటుచేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టెక్కలి ప్రాంతంలో రైలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రైలు మార్గం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మృతుల వివరాలు, వారు ఏ పరిస్థితుల్లో రైల్వే ట్రాక్పైకి వచ్చారు, ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande