ప్రభుత్వ హాస్పిటల్లో ఆకస్మిక తనిఖి నిర్వహించిన అడిషనల్ కలెక్టర్
రోగులకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి సూచించారు.
Collector


హైదరాబాద్, 23 సెప్టెంబర్ (హి.స.)

రోగులకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి, సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వారు సందర్శించారు. రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని సదుపాయాలను రికార్డులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందరూ డాక్టర్లు అందుబాటులో ఉంటారని 4 నుండి రాత్రి వేళల్లో ఒక వైద్యుడు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తారని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande