
అమరావతి , 23 సెప్టెంబర్ (హి.స.)పల్నాడు జిల్లాలో మూడేళ్ల బాలుడు పాఠశాల బస్సు కింద పడి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం లంకెలకూరపాడు గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసుల వివరాల ప్రకారం, చిన్నారి కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. బాలుడి అన్నయ్య పాఠశాలలో చదువుతున్నాడు. సాధారణంగా అతడిని పాఠశాల బస్సు ఎక్కించేందుకు తల్లి తీసుకువెళ్తుండేది. రోడ్డు దాటుతున్న సమయంలో చిన్నారి బస్సు డ్రైవర్ దృష్టికి రాకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.బస్సు వెనుక చక్రం బాలుడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఘటన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్