డీఎస్సీ నియామకాలపై రాజకీయ వివాదం.. గవర్నర్ను కలవనున్న వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది.
Jagan


అమరావతి , 23 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదం కొనసాగుతోంది. నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు గవర్నర్ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్సీపీ వర్గాల ప్రకారం, డీఎస్సీ నియామకాలపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు తమ ఆందోళనలకు అంతరాయం కలిగించేందుకు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande