శ్రీశైలం వినాయక చవితి గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు
శ్రీశైలంలో నిర్వహించిన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి.
శ్రీశైలం వినాయక చవితి   గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు


శ్రీశైలం, 23 సెప్టెంబర్ (హి.స.)వినాయక చవితిని పురస్కరించుకొని లోక కల్యాణం కోసం 9 రోజులపాటు శ్రీశైలంలో నిర్వహించిన గణపతి నవరాత్రోత్సవాలు బుధవారంతో ముగిశాయి. శ్రీశైలం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 14వ ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి .

ముగింపులో భాగంగా శ్రీస్వామివారి యాగశాలలో ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు,బోర్డు నెంబర్లు అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు. మందుగా శ్రీస్వామివారి ఆలయంలోని రత్నగర్భగణపతికి,సాక్షిగణపతికి, మృత్తికా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి,వసంతోత్సవం, అవబృథం జరిపించారు.

పూర్ణాహుతి శాస్త్రోక్తంగా నారికేళాలు పలు సుగంధద్రవ్యాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు,ట్రస్టు బోర్డు మెంబర్లు అర్చకులు పూర్తి చేశారు అనంతరం వరసిద్ధి వినాయక పంచలోహమూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికాగుండంలో వైదిక శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించి తర్వాత సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పబడిన మృత్తికా గణపతిస్వామికి విశేషంగా పూజాదికాలు చేసి సాయంత్రం లింగాల గట్టులో మృతిక గణపతి నిమజ్జనం ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande