ఇంటింటి ప్రచారం నిర్వహించిన విజయలక్ష్మి గునుకుల
ఇంటింటి ప్రచారం నిర్వహించిన విజయలక్ష్మి గునుకుల
జనసేన వీరమహిళ విజయలక్ష్మి గునుకుల నెల్లూరులో ఇంటింటి ప్రచారం!


నెల్లూరు, 23 సెప్టెంబర్ (హి.స.)నెల్లూరు నగరంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలను వివరిస్తూ 16వ డివిజన్లో జనసేన నాయకురాలు విజయలక్ష్మి గునుకుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ దృక్పథంతో, కూటమి ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా మహిళలను కలిసి వారి స్థానిక సమస్యలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, మహిళలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించారు. స్థానిక సంస్థల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరాన్ని వారు వివరించారు.జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా తదితర శాఖలను నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థానిక పాలన, ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande