సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు.. అభిజీత్ దీప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోకపోతే దేశవ్యాప్త ఆందోళనలు.. అభిజీత్ దీప్కే
Cockroach janatha


హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి తప్పుకోకపోతే అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ముంబై వేదికగా దేశవ్యాప్త ఆందోళనలను ప్రారంభిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. జ్ఞానేశ్ కుమార్ శనివారంలోగా రాజీనామా చేయకపోతే, అక్టోబర్ 2న ముంబై నుంచి నిరసనలను ప్రారంభించి, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఈ ప్రజా ఉద్యమాన్ని విస్తరిస్తాం. ఈ గాంధీ జయంతి వేళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం అని హెచ్చరికలు జారీ చేశారు.

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఇతర ఎన్నికల కమిషనర్లను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కోట్ల సంఖ్యలో ఓట్ల తొలగింపు వంటి అంశాలపై తీవ్ర ఆరోపణలు వస్తున్న తరుణంలో సీజేపీ ఈ అల్టిమేటం విధించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande