
పోలవరం, 26 సెప్టెంబర్ (హి.స.)
పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో శబరి నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది.
చింతూరు వద్ద శబరి నీటిమట్టం 41 అడుగులకు చేరుకోగా, కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 22 అడుగులకు పెరిగింది. పలు వాగులు పొంగిపొర్లడంతో రహదారులపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పోలవరం జిల్లాలోని శబరి నదిలో వరద ప్రవాహం ఉధృతమైంది.
బలిమెల, సీలేరు, డొంకరాయి జలాశయాల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నదిలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
చింతూరు వద్ద శబరి నీటిమట్టం 41 అడుగులకు చేరగా, శబరి ఒడ్డున ఉన్న ఇళ్లు, దుకాణాల వద్దకు వరద నీరు చేరింది. పలు వాగులు పొంగిపొర్లడంతో కొన్ని రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో 10 కట్ఆఫ్ పాయింట్లను అధికారులు గుర్తించారు. కూనవరం మండలంలో 2, వీఆర్పురం మండలంలో 2, చింతూరు మండలంలో 6 కట్ఆఫ్ పాయింట్ల వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ