
ఢిల్లీ , 26 సెప్టెంబర్ (హి.స.)జమ్మూ కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసింది. తీర్మానంలోని కొన్ని అంశాలు, ముఖ్యంగా గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ చేసిన తీర్మానాల ప్రస్తావనపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది.
తీర్మానం ఉద్దేశ్యం జమ్మూ కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం. అయితే దీనికి సంబంధించిన రాజకీయ భాష, ప్రత్యేక హోదా అంశాల ప్రస్తావనపై బీజేపీ వైపు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 2019లో రాజ్యాంగపరమైన మార్పుల తర్వాత జమ్మూ కశ్మీర్ ప్రత్యేక రాజకీయ-పరిపాలనా వ్యవస్థ నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. అనంతరం ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర హోదా అంశం మళ్లీ కేంద్ర చర్చకు వచ్చింది. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ముందుకు తీసుకెళ్లింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్