తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్ధీ
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
తిరుమల


తిరుమల, 26 సెప్టెంబర్ (హి.స.) తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

ఈ రోజు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్నారు.

దీంతో టోకేన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోగా క్యూలైన్ కృష్ణతేజ సర్కిల్ వరకు వ్యాపించింది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం కూడా భక్తుల రద్ధీ కొనసాగగా.. శ్రీవారిని 66,014 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31, 092 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

అలాగే భక్తుల మొక్కుల రూపంలో టీటీడీకి శుక్రవారం హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande