శ్రీకాళహస్తిలో మెగా కార్డన్ సెర్చ్: సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్
సరైన పత్రాలు, లైసెన్సులు లేకుండా నడిపే వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామని తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.
ఆర్ల శ్రీనివాసులు


శ్రీకాళహస్తి , 26 సెప్టెంబర్ (హి.స.)సరైన పత్రాలు, లైసెన్సులు లేకుండా నడిపే వాహనాలను గుర్తించి సీజ్ చేస్తున్నామని తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.

తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ రోజు శనివారం తెల్లవారు జామున కమ్యూనిటీ కాంటాక్ట్ మరియు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, అసంపూర్తి పత్రాలతో ఉన్న వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం సీజ్ చేశారు.

ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఆర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని, గ్రామలలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎవరైనా కొత్తవారు అద్దెకు వస్తే వారికి సంబందించిన పూర్తి సమాచారం తీసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదన్నారు. ఏవైనా సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande