ఘనంగా దుర్గమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
దుర్గమ్మ ఆశీస్సులతో ఈ ఏడాది కూడా మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
Vijayawada temple

అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)

దుర్గమ్మ ఆశీస్సులతో ఈ ఏడాది కూడా మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

సాంస్కృతిక, కళల రాజధాని విజయవాడ అని మరోసారి చాటిచెప్పే విధంగా ఈ ఏడాది నవరాత్రోత్సవాలను నిర్వహిస్తామని మంత్రి కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఉత్సవ్, నేషనల్ సరస్సు మేళ, పసందైన వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

రేపు(సోమవారం) నిర్వహించే కర్టెన్ రైజ్ ఈవెంట్లో ఉత్సవాలలో జరిగే అన్నీ కార్యక్రమాల గురించి వివరిస్తామన్నారు. ఈ మేరకు అక్టోబర్ 8 నుంచి 23 వరకు సరస్సు మేళ, అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవాలు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.

పున్నమి ఘాట్, ఎం.బి.కె స్టేడియంలో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తికానున్నాయని మంత్రి తెలిపారు. వీటితోపాటు పది రోజుల వరకు కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande