నగదు మార్పిడి పేరుతో భారీ మోసం
నగదు మార్పిడి పేరుతో విశాఖలో భారీ మోసం వెలుగు చూసింది. ముగ్గురు బాధితులపై దాడి చేసిన దుండగులు రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి ఆర్టీసీ డిపో డ్రైవర్ రమేశ్కు ఆన్లైన్లో రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు.
నగదు మార్పిడి పేరుతో భారీ మోసం

విశాఖ, 27 సెప్టెంబర్ (హి.స.)

నగదు మార్పిడి పేరుతో విశాఖలో భారీ మోసం వెలుగు చూసింది. ముగ్గురు బాధితులపై దాడి చేసిన దుండగులు రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం అపహరించుకుపోయారు. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి ఆర్టీసీ డిపో డ్రైవర్ రమేశ్కు ఆన్లైన్లో రాజు అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

నగదు ఇస్తే.. డాలర్లుగా మార్చి ఇస్తామంటూ రమేశ్, అతడి స్నేహితుడిని బురిడీ కొట్టాడు. నగదు మార్పిడి కోసం శనివారం అర్ధరాత్రి బాధితులు నగరంలోని డైమండ్ పార్కు వద్దకు కారులో వచ్చారు.

బైక్పై వచ్చిన నిందితులు రాజు పంపాడని రమేశ్ను పరిచయం చేసుకున్నారు. రమేశ్, ఆయన భార్య, స్నేహితుడిపై దాడి చేశారు.

రమేశ్ బ్యాగులో రూ.18 లక్షలు, స్నేహితుడి బ్యాగులో రూ.50 లక్షలు, 10 తులాల బంగారం అపహరించుకుపోయారు. దీంతో ద్వారకానగర్ పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande