
అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.)
ప్రకృతి రమణీయత, సహజసిద్ధమైన వాతావరణం, దట్టమైన అటవీ ప్రాంతాలు, మండు వేసవిలోనూ మంచు తెరలు, జలపాతాలు, ఎత్తైన కొండలు, లోయలు, ఘాట్ రోడ్లు, గోదావరి పరవళ్లు.. పోలవరం జిల్లా పర్యాటకానికి ప్రత్యేకం.
జిల్లాలోని రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలోని 12 మండలాల్లో పర్యాటక ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వారాంతాలు, సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది.
దీంతో ప్రభుత్వ శాఖలతో పాటు ప్రైవేటు రంగంలోనూ వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపడుతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలోని కమ్యూనిటీ బేస్డ్ ఎకో-టూరిజం ద్వారా రిసార్టులు, కాటేజీలు, అతిథిగృహాల నిర్మాణాలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ