షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్


నెల్లూరు, 27 సెప్టెంబర్ (హి.స.)

నెల్లూరు జిల్లాకోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల బకాయిల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సుమారు 400 మంది బకాయిల చెల్లింపులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.22 కోట్ల బకాయిల చెల్లింపులకు జీవో విడుదల చేసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాలాభిషేకం చేసి మాట్లాడారు. 11 ఏళ్ల కార్మికుల నిరీక్షణ ఫలించిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ సమస్యని ఎన్నికల అస్త్రంగా వాడుకుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని నిరూపించుకుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన షుగర్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande