ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్ ది.. ఎంపీ రఘునందన్ రావు
మెతుకు సీమ గా ప్రసిద్ధిగాంచిన మెదక్ పర్యాటకంగా ప్రలవిల్లుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Mp


మెదక్, 27 సెప్టెంబర్ (హి.స.)

మెతుకు సీమ గా ప్రసిద్ధిగాంచిన మెదక్ పర్యాటకంగా ప్రలవిల్లుతుందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలో ఆదివారం 4000 మంది తో ర్యాలీ నిర్వహించి మెదక్ ఖిల్లా పై కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ మున్సిపల్ చైర్పర్సన్ రాధిక భూపతి రాజులు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పర్యాటక రంగంలో మొదటి బహుమతి పొందిన కలెక్టర్ ప్రతిమా సింగ్ ను అభినందించారు.

మోదీ నాయకత్వంలో భారతదేశంలో పర్యాటక రంగం చాలా అభివృద్ధి సాధించిందని ప్రపంచంలో ఉన్న 175 దేశాలు భారతదేశానికి పర్యాటక సంస్థలను సందర్శిస్తున్నారని అన్నారు. భారత్ టూరిజం లో చాలా ముందుకెళ్తుందని తెలిపారు.

ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు పోటీగా మెదక్ టూరిజం అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande