తెలంగాణ మంత్రులు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టాలి...... రేవంత్ రెడ్డి
తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా కమ్యూనికేషన్కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులు తమ శాఖల పనితీరును ప్రజలకు డిజిటల్ మాధ్యమాల ద్వారా మరింత సమర్థంగా తెలియజేయాలని సూచించారు.
CM Revanth Reddy


హైదరాబాద్ , 27 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా కమ్యూనికేషన్కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులు తమ శాఖల పనితీరును ప్రజలకు డిజిటల్ మాధ్యమాల ద్వారా మరింత సమర్థంగా తెలియజేయాలని సూచించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, సంక్షేమ చర్యల గురించి ప్రజలకు సమాచారం చేరేలా మంత్రుల కార్యాలయాల కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు.

ప్రభుత్వ పథకాలు, మంత్రుల పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలు వంటి అంశాలపై అధికారిక సమాచారాన్ని వేగంగా అందించాల్సిన అవసరం పెరిగిందన్నారు.

సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం పెంచడంలో అధికారిక సమాచారానికి ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా తప్పుడు సమాచారం, రాజకీయ ఆరోపణలు, ప్రతిపక్ష విమర్శలు వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ప్రభుత్వం తన అధికారిక వైఖరిని సమయానుకూలంగా వెల్లడించడం ఒక కమ్యూనికేషన్ సవాలుగా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande