పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది.. భట్టి విక్రమార్క
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి నిజమైన మూలస్తంభాలని, వారికి పార్టీ మరియు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Deputy CM

ఖమ్మం, 27 సెప్టెంబర్ (హి.స.)

ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి నిజమైన మూలస్తంభాలని, వారికి పార్టీ మరియు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ప్రభుత్వ విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రజా పాలనకు మంచి పేరు తీసుకురావాలని ఆయన బిఎల్ఎలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

బిఎల్ఎల పనితీరు, శ్రమ మిగతా మండలాల కంటే చాలా అద్భుతంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి ప్రశంసించారు.

గ్రామ స్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్త శ్రమకు తగిన గౌరవం లభిస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటీకి చేర్చి ప్రజా పాలనకు మంచి పేరు తీసుకురావాల్సిన బాధ్యత బిఎల్డీలపైనే ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande