పూర్తయిన గణేష్ నిమజ్జనాలు.. జిహెచ్ఎంసి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం పూర్తయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ నగరంలో ముమ్మరంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
GHMC


హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

జంట నగరాల్లో గణేష్ నిమజ్జనం పూర్తయింది. ఈ నేపథ్యంలో

జీహెచ్ఎంసీ నగరంలో ముమ్మరంగా శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

నిమజ్జన పాయింట్లు, ఊరేగింపు మార్గాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యర్థాల తొలగింపును వేగవంతం చేశారు. మూడు షిఫ్టుల్లో 15వేల మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

హుస్సేన్ సాగర్లో విగ్రహాల నిజమజ్జనం కారణంగా అక్కడకు భారీగా ప్రజలు, వాహనాలు వచ్చాయి. దీంతో సాగర్ చుట్టూ పరిసరప్రాంతాల్లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఆ చెత్తను సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. మరోవైపు రెండు రోజుల్లో 3 కార్పొరేషన్లలో అదనంగా 13వేల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. చెత్తను తొలగించడానికి సిబ్బంది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సేకరించిన చెత్తను ప్రత్యేక వాహనాలతో తరలిస్తున్నారు. ఈ చెత్తనంతా వాహనాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande