
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ఇకపై 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026ను ప్రభుత్వం తీసుకొచ్చిందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
ఈ మార్పులతో వినియోగదారులకు మరిన్ని రీచార్జ్ ఆప్షన్లు, సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఏడాదిలో 13 సార్లు నెలవారీ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్స్ ద్వారా 12 రీచార్జ్తో సరిపెట్టుకోవచ్చని రాఘవ్ చద్దా తెలిపారు.
దీనితోపాటు డేటా అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సేవలతో కూడిన ప్లాన్స్ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. మొబైల్ ఉపయోగించే తక్కువ బడ్జెట్ వినియోగదారులకు ఇవి మరింత అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు