
సిద్దిపేట, 27 సెప్టెంబర్ (హి.స.)
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జీవన్ రామ్ భవన్ లో పోలీస్ కానిస్టేబుల్ కేసీఆర్ ఉచిత శిక్షణ శిబిరాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్ పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 7వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు.
ఖాళీలు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేక నిరుద్యోగాలను మోసం చేస్తుందన్నారు. అధికారం లేనప్పుడు ప్రభుత్వ ఏర్పాటు అయితే మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలను మాయ మాటలు చెప్పారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు 16 వేలు మాత్రమే అన్నారు. నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యం గా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్ స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కాలని రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధించారని గుర్తు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..