
హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
రేవంత్రెడ్డిని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈడ్చినట్టేనని ఎద్దేవా చేశారు. ఆదివారం శంషాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పోలీసులు దోపిడీలు జరిగితే చర్యలు తీసుకోవాల్సింది పోయి డీజేలను బంద్ చేస్తున్నారని విమర్శించారు. గడ్డిపోచ కూడా గడ్డపారగా మారి తిరగబడుతుందని వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..