కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సినీ హీరో వరుణ్ తేజ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Varun Tej


జగిత్యాల, 27 సెప్టెంబర్ (హి.స.)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో సినీ హీరో వరుణ్ తేజ్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హనుమాన్ దీక్షలో ఉన్న వరుణ్ తేజ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న మహిమ గురించి చెప్పడంతో గతంలో కూడా ఒకసారి ఆలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హనుమాన్ దీక్షలో భాగంగా మరోసారి కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande