మంత్రి పదవి ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో లేదు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని దీనివల్ల సాగునీరు అందక మునుగోడు నియోజకవర్గం ఎడారిలా మారిపోయిందని, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
MLA

హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.)

గత బీఆర్ఎస్ ప్రభుత్వం శివన్నగూడెం రిజర్వాయర్ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని దీనివల్ల సాగునీరు అందక మునుగోడు నియోజకవర్గం ఎడారిలా మారిపోయిందని, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గానికి నీళ్లు అందించే డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఆయన తెలిపారు.

నకిరేకల్ సభలోడిండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం ఒప్పుకున్న తర్వాతే ఆయనకు శాలువా కప్పి సత్కరించానని స్పష్టం చేశారు. కానీ మంత్రి పదవి కోసం సీఎంను కలిశానని బద్నాం చేస్తున్నారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande