
నెల్లూరు, 27 సెప్టెంబర్ (హి.స.)
వచ్చే ఏడాది జూన్ 12లోపు నెల్లూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.
గత ప్రభుత్వం చివరి దశలో పది శాతం పనులను పూర్తి చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని, ప్రస్తుతం మళ్లీ నిధులు సమీకరించి పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు.
నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు సీఎం రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు.
అలాగే నవాబుపేటలో 21.3 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్లతో పీపీపీ విధానంలో కమర్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ