
వరంగల్, 27 సెప్టెంబర్ (హి.స.)
అందరికీ ఉపయోగపడే సమాచార హక్కు చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాసరావు అన్నారు.
సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు ఆదివారం హనుమకొండ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సదస్సులో సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాస రావు పాల్గొని మాట్లాడుతూ.. సమాచార హక్కు పై ప్రజలకు అవగాహన ఎంతో అవసరమని ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో ఉపయోగపడే ఆయుధం అన్ని దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన వివరించారు.
ప్రస్తుత వ్యవస్థలో సమస్సలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని ఇలాంటి సదస్సుల వలన సమాచార హక్కు చట్టం ఎంతో దోహద పడుతుందని ఆయన అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు