
న్యూఢిల్లీ, 27 సెప్టెంబర్ (హి.స.)
కేంద్ర ప్రభుత్వం మరియు ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం పూర్తిగా అధికార పక్షం కనుసన్నల్లో నడుస్తోందని, స్వతంత్రతను కోల్పోయిందని మండిపడ్డారు.
ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది మంది పేర్లను తొలగించడం, ఎన్నికల వేళ పరిపాలనా పరమైన అధికారులను ఏకపక్షంగా బదిలీ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని శత్రుఘ్న సిన్హా ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, బెంగాల్‌లో ఏ రాజకీయ వ్యూహాలు పారవని ఆయన స్పష్టం చేశారు. తాము ఈ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకిస్తూ ప్రజాక్షేత్రంలోనూ, న్యాయపరంగానూ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశానికే రోడ మోడల్ నిలిచిందని, ప్రజలంతా మమత వెంటే ఉన్నారని ఆయన కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi