సిద్దిపేటలో గణేశ్ నిమజ్జనంలో ఇద్దరు యువకులు మృతి......భద్రతా ఏర్పాట్లపై చర్చ
సిద్దిపేట జిల్లాలో గణేశ్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది.
Ganesh festival


సిద్దిపేట , 27 సెప్టెంబర్ (హి.స.)సిద్దిపేట జిల్లాలో గణేశ్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. రుద్రారం ప్రాంతంలోని పెద్దచెరువులో గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే సమయంలో ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. వారిని బయటకు తీసేందుకు స్థానికులు, అధికారులు ప్రయత్నించినప్పటికీ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట ఘటన నేపథ్యంలో నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చ మొదలైంది. విగ్రహాలను నీటిలోకి తీసుకెళ్లే సమయంలో స్థానిక నిర్వాహకులు, యువత, భక్తులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

చెరువులు, జలాశయాల్లో నీటి లోతు ప్రాంతాలను ముందుగానే గుర్తించడం, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం, అత్యవసర వైద్య బృందాలను సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు కీలకంగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande