
హైదరాబాద్ , 28 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణలో భూములు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. 22-A నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ చట్టబద్ధమైన అనుమతులు కలిగిన కొన్ని ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో చాలాకాలంగా రిజిస్ట్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్న ఆస్తుల యజమానులకు ప్రాధాన్యం కలిగిన పరిణామంగా మారింది.
ప్రత్యేకంగా GHMC, HMDA, DTCP, మున్సిపాలిటీలు లేదా ఇతర సంబంధిత స్థానిక సంస్థల నుంచి లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్మెంట్కు చట్టబద్ధమైన అనుమతులు పొందిన ఆస్తులను ఈ ప్రక్రియలో పరిశీలించనున్నారు. అయితే 22-A జాబితాలో ఉన్న ప్రతి ఆస్తికి ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అవకాశం లభించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమి స్వభావం, అందుబాటులో ఉన్న రికార్డులు, సంబంధిత అనుమతులు, న్యాయపరమైన వివాదాలు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అర్హత నిర్ణయిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాత పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు, సంబంధిత అనుమతులను ఈ ప్రక్రియకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పరిశీలించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్