బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాలని భావించిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది.
POSTPONED


ఢిల్లీ , 28 సెప్టెంబర్ (హి.స.)దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాలని భావించిన బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ప్రధానంగా వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్పై చర్చించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడానికి IBA చర్చలు జరుపుతుంది.

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో నెలకు రెండో, నాలుగో శనివారాలు సెలవులుగా ఉన్నాయి. మిగిలిన శనివారాల్లో కూడా సెలవు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. దీన్ని వారానికి ఐదు రోజుల పని విధానంగా అమలు చేయాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగుల పని–జీవిత సమతుల్యత, సిబ్బంది పని గంటలు, వినియోగదారులకు సేవల అందుబాటు వంటి అంశాలు ఈ చర్చలో ప్రధానంగా మారాయి. సమ్మె వాయిదా పడటంతో సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగాల్సిన పరిస్థితి తాత్కాలికంగా తప్పింది. గత ఆదివారం కూడా కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖలను పనిచేయించేలా ఏర్పాట్లు చేయడం ద్వారా వినియోగదారులకు ఇబ్బంది కలగా లేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande